నిర్మల్: రాజీ పద్ధతిలో లోక్ అదాలత్ లో విడాకుల సమస్య పరిష్కారం
నిర్మల్ లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో తమ విడాకుల కేసును రాజీ పద్ధతులలో పరిష్కరించుకున్న భార్యాభర్తలను జిల్లా కలెక్టర్, న్యాయమూర్తులు అభినందించారు. భార్య భర్తలు ఇద్దరిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా న్యాయమూర్తి శ్రీ వాణి, డిఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక పూల బోకేనిచ్చి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇందులో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయవాదులు, కక్షిదారులు ఉన్నారు.