నిర్మల్: ఆలయాల అభివృద్ధికి కృషి :ఏలేటి
నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట లో గంగా మాత ఆలయ నిర్మాణ పనులను అయన భూమి పూజ చేశారు. ఇప్పటికే కోట్ల ఐదు రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఇందులో నాయకులు మొహమ్మద్ జమాల్, నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.