నిర్మల్: భీమ్ దీక్షను ప్రతి ఒక్కరు స్వీకరించాలి
ఏప్రిల్ 14 బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే భీమ్ దీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అంబేద్కర్ సంఘ జిల్లా నాయకులు బత్తుల రంజిత్ కుమార్ గురువారం తెలిపారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు మాన్యవర్ కాన్షీరామ్ జయంతి పురస్కరించుకొని ప్రతి ఏడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని చెప్పారు. నిర్మల్ లోని సోఫీ నగర్ లో నిర్వహించే దీక్ష స్వీకరణ కార్యక్రమంలో ప్రతిఒక్కలు పాల్గొనాలని కోరారు.