నిర్మల్: డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ప్రతి శుక్ర, మంగళ వారాలలో డెంగ్యూ నివారణ కార్యక్రమాన్ని గ్రామాలలో నిర్వహించాలన్నారు. అంతకుముందు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.