నిర్మల్: రైతు గుర్తింపు కార్డు నమోదు తప్పనిసరి: ఏఈఓ ప్రగతి
సోన్ మండలంలోని కడ్తాల్ లో రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ చురుకుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏఈఓ ప్రగతి మాట్లాడుతూ రైతులందరూ తమ గుర్తింపు కార్డుల నమోదును బాధ్యతగా చేయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నదన్నారు. ఇందుకోసం పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డుతో సంప్రదించాలన్నారు.