నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రూప్ -2 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 8080 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా వీరి కోసం 24 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో అభ్యర్థులు గంట ముందు గానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.