నిర్మల్: పని ప్రదేశాలలోనే ఉపాధి కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి
ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలని రైతుకూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ మహమూద్ డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో వారికి సంఘీభావం ప్రకటించారు. ఈనెల 20న నిర్వహించే సమ్మెలో కూలీలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలన్నారు. ఇందులో నర్సయ్య, మల్లేశం, శ్రీనివాస్, లక్ష్మీ, లావణ్యలు ఉన్నారు.