కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా పార్లమెంటరీ సమావేశం విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తదితరులు హాజరవుతారని తెలిపారు.