జామ్ గ్రామానికి చెందిన కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది నెలకొల్పిన కొర్వ నవీన్ రామ క్రిష్ణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని జామ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, ఇంగ్లీష్ డిక్షణరీలు, అభ్యాస సామాగ్రి అందజేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు జనార్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం కీలకమన్నారు.