నిర్మల్: ట్రంప్ దురహంకార చర్యని ఖండిద్దాం
భారతీయులకు బేడీలు వేసి పంపిస్తున్న ట్రంప్ దురహంకార చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని (సిపిఐ ఎంఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కే. రాజన్న పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురఅహంకారంతో చేస్తున్న ఆకృత్యాలను ప్రధాని మోడీ ఖండించకపోవడం శోచనీయమని అన్నారు.