నిర్మల్: బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత
నిర్మల్ పట్టణం గాంధీ నగర్ కు చెందిన మామిడాల అన్నపూర్ణకు నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూ. 1. 50, లక్షల సీఎంఆర్ఎఫ్ LOC ను మంజూరు చేయించారు. ఈ మేరకు బీజేపీ నాయకులు లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో బీజేపీ నాయకులు మహమ్మద్ జమాల్, పట్టణాధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, BJYM జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, కొండాజి శ్రావణ్ లు పాల్గొన్నారు.