ఇటీవలే నిర్మల్ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అక్రమంగా అడ్డగించి, దాడి చేసి, బలవంతంగా వాహనంలో బంధించి కిడ్నాప్ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాలో కీలక నిందితుడైన ఇబ్రహీం బిల్డర్ అలియాస్ అబ్దుల్ ను నిర్మల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. ఈనెల 5 న ఇబ్రహీం స్థానిక సోఫినగర్ ప్రాంతంలో ఉన్నాడని పక్క సమాచారం ఆధారంగా ప్రవీణ్ కుమార్ రైడ్ నిర్వహించి, స్థానిక దర్గా వద్ద ఇబ్రహీంను అరెస్టు చేశారు. అతని వద్ద నుండి కత్తి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.