నిర్మల్: మరమ్మతులు లేక మూలన పడ్డ మున్సిపల్ జేసీబీలు
నిర్మల్ పురపాలక సంఘంలో అనునిత్యం పారిశుద్ధ్య, ఇతర పనుల కోసం ఉపయోగపడే జేసీబీలు ఇతర వాహనాలు మరమ్మతులకు నోచుకోక మూలాన పడ్డాయి. 42 వార్డులు గల నిర్మల్ పురపాలక సంఘంలో ఆయా రకాల వాహనాలతోపాటు రెండు జేసీబీలు ఉన్నాయి. మూడు నెలలుగా కనీస మరమ్మత్తులు లేక పోగా, పట్టణంలో వీటి వినియోగం లేక సమస్యలు పెరుగుతున్నాయి. నిధుల లేమితోనే మరమ్మతులు చేయలేక మూలన పడేసినట్లు తెలుస్తుంది.