నిర్మల్ మున్సిపల్ ఫిర్యాదుల విభాగంలో ఆపరేటర్‌ను నియమించాలి
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు, ఫిర్యాదుల విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించాలని ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మహమ్మద్ అజహర్ ఓద్దీన్ పేర్కొన్నారు. బుధవారం కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు దరఖాస్తు చేశారు. ప్రజా పాలన దరఖాస్తుల మార్పులు, చేర్పులు తదితర విషయంలో కంప్యూటరీకరణ అత్యవసరమని చెప్పారు. ఇది లేకపోవడంతో ఆలస్యం అవుతుందన్నారు.