నిర్మల్: వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింల నిరసన
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్మల్ లో ముస్లింలు శాంతియుతంగా నిరసన తెలిపారు. చేతులకు నల్ల గుడ్డలు కట్టుకొని శుక్రవారం ప్రార్థనల అనంతరం తమ నిరసనను తెలిపారు. కేంద్రం తెచ్చిన ఈ బిల్లును ఒప్పుకునేది లేదని మత గురువులు, మత పెద్దలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నియమ నిబంధనలకు కనుగుణంగా సామరస్యతతో ఉద్యమాలు చేస్తామన్నారు.