నిర్మల్: నులిపురుగుల జాతీయ దినోత్సవం చేయాలి
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంను విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈనెల 10న నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నూలిపురుగుల నివారణ ఆల్బెండల్ మాత్రలను అందించాలన్నారు.