నిర్మల్: క్యాన్సర్ పట్ల అప్రమత్తత అవసరం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని అంజనీతండాలో వరల్డ్ క్యాన్సర్ డే పురస్కరించుకొని మంగళవారం ఐడీఏ ఆధ్వర్యంలో నోటి క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. పొగాకు, గుట్కా, పాన్, జర్దా, తంబాకు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి సూచించారు. అనంతరం గ్రామస్థులకు దంత పరీక్షలు నిర్వహించారు.