నిర్మల్: కొత్త పాఠశాలలు మంజూరు
కొత్త పాఠశాలల నిర్వహణకు బడ్జెట్ ను కలెక్టర్ల ద్వారానే ప్రభుత్వం సమకూర్చనుంది. రాష్ట్రంలో 157 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కొత్తగా ప్రభుత్వం మంజూరు చేస్తూ విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులున్నా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ జిల్లాలో 5 కొత్త పాఠశాలలు మంజూరు కాగా తక్షణమే తెరవాలని జిల్లా విద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.