నిర్మల్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ

60చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తి ప్రపత్తులతో పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పిల్లా పాపాలతో సాంప్రదాయ పద్ధతులలో స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్