నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్ పేట్ సబ్ స్టేషన్ లో వేసవి మరమ్మత్తుల కారణంగా, ఈ సబ్ స్టేషన్ పరిధిలోని అగ్రికల్చర్ మార్కెట్, మోచిగల్లి, బుధవార్ పేట్, గాంధీచౌక్, కబూతర్ కమాన్ బంగల్పేట్, రామ్ రావు బాగ్, విశ్వనాథ్ పేట్, వైయస్సార్ కాలని, సాయిబాబా టెంపుల్ ఏరియా, గాజుల్ పెట్, డాక్టర్స్ లేన్ ప్రదేశాల్లో నేడు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు.