నిర్మల్ పట్టణ స్వర్ణకారుల సంఘం ఎన్నికలను బుధవారం పట్టణంలో నిర్వహించారు. పట్టణ అధ్యక్షులుగా రామోజీ నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా అన్వేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణకారుల సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను పలువురు అభినందించారు.