నిర్మల్ రూరల్: సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం
నిర్మల్ రూరల్ మండలంలోని లంగ్డాపూర్ లో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించినట్లు బీజేపీ నాయకులు జమాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే మండలంలోని గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు వేయడం జరిగిందని పేర్కొన్నారు.