నిర్మల్: రైతు వ్యతిరేక బడ్జెట్ పై సంయుక్త కిసాన్ మోర్చ ధర్నా
వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్‌పై బుధవారం సంగీత కిసాన్ మోర్చా కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్మల్ మౌలానా అబుల్ కలాంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కే రాజన్న ఎస్ విలాస్ నూతన్ కుమార్ నందిరామయ్య ఎస్ఎన్ రెడ్డి రాజు ఎస్ రాజేష్ లు మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలికేలా ఉన్న ఈ బడ్జెట్‌ను వ్యవసాయ రంగమంతా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.