నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు (కేజీబీవీ మినహా) శనివారం 11 నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని డీఈఓ రామారావు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్లో ఈనెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయని తెలిపారు. ఈనెల 18న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని అన్నారు.