నిర్మల్: రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారి ఎంపిక వేగవంతం
రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఆయన ఈ పథకం లబ్ధిదారుల ఎంపికపై సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలని ఎలాంటి అనుమానాలు ఉన్న వెంటనే పునర్పరిశీలన చేయాలని సూచించారు.