ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో పలువురు విద్యార్థులు మృతిచెందగా, ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శనివారం వామపక్షాల విద్యా సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో విద్యా సంస్థల బందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న ప్రభుత్వ హాస్టలలో సరైన వసతులు కల్పించలేదని మండిపడ్డారు. ఇకనైనా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.