పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
దీపావళి పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఆగి ఉన్న కారుని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో భార్యభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు నకిరేకల్ కు చెందిన బొబ్బల నర్సిరెడ్డి, సరోజమ్మగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.