నిర్మల్: వార్షికోత్సవానికి ముస్తాబైన శ్రీశ్రీశ్రీ చాందా మహాకాళి ఆలయం
శ్రీశ్రీశ్రీ చాందా మహాకాళి అమ్మవారి ఖిల్లా గుట్ట నిర్మల్ మూడవ వార్షికోత్సవానికి ముస్తాబైన ఆలయం. ఈనెల 18న శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం పూజా కార్యక్రమాలతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. ఉత్సవ విగ్రహంతో పురవీధులలో శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.