మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ మాట్లాడుతూ. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 7న వేల డప్పులు, లక్ష గొంతుకలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అప్పటిలోపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు.