నిర్మల్: అద్వాన స్థితిలో వీధి దీపాల విద్యుత్ సరఫరా మీటర్ బాక్సులు
నిర్మల్ లోని విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను విద్యుత్ సరఫరా చేసే బాక్సులు అద్వాన స్థితికి చేరుకున్నాయి. 160కు పైగా ఉన్న వీధి దీపాల విద్యుత్ సరఫరా మీటర్ బాక్స్ లలో సగం కూడా సరిగా లేవు. స్తంభాలకే మీటర్లను బిగించి పాడైన బాక్స్ లతోనే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రమాదవశాత్తు అటువైపు వెళ్ళిన వారు విద్యుత్ షాక్ కు గురవుతున్నారు.
సరైన బాక్స్ లను వెంటనే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.