నిర్మల్: ఆక్రమణదారులపై కఠిన చర్యలు: కలెక్టర్

0చూసినవారు
నిర్మల్ లోని ప్రధాన రహదారులపై తోపుడు బండ్లు సంచార వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకోవడం సరికాదని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ హెచ్చరించారు. శనివారం పాత బస్టాండ్ కొత్త బస్టాండ్, మినీ ట్యాంక్ బండ్ పరిసరాలలో రోడ్లపైకి వచ్చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వ్యాపారాలను హెచ్చరించారు. పోలీస్ పురపాలక శాఖ నియంత్రణ సరిహద్దులకు అనుగుణంగా వ్యాపారాలు చేసుకోవాలన్నారు. ఇందులో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్