విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కైలాస్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మాట్లాడారు. పాఠశాలలో గురుకుల హాస్టల్ లో సరఫరా అవుతున్న వస్తువుల నాణ్యత పై ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో, కేజీబీవీలు, మోడల్ స్కూల్ ల సంక్షేమం పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.