

తిరుపతిలో దారుణం.. ఆలయం కూల్చివేత
AP: తిరుపతి జిల్లా దామినేడులో దారుణం చోటు చేసుకుంది. కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి 20 మంది అనుచరులతో ఇనాం భూమిలో ఉన్న నాగాలమ్మ దేవాలయాన్ని కూల్చివేశాడు. స్థానికులు వాహనాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఆ భూమి తనదేని కృష్ణమూర్తి నాయుడు స్థానికులతో వాదనకు దిగాడు. దాంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కృష్ణమూర్తిని తిరుచానూరు స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.