నిర్మల్: హిందువులంతా సంఘటితమైతేనే దేశ రక్షణ
హిందువులు సంఘటితంగా ఉంటేనే ఈ దేశాన్ని రక్షించుకోగలమని శివాజీ సేవా సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మెడిసెమ్మ రాజు అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్ లో చత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. దేశ పరిరక్షణ బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో పలువురు పాల్గొన్నారు.