నిర్మల్: పరిసరాల శుభ్రత పాటించాలి

83చూసినవారు
వ్యక్తిగత పరిసరాల శుభ్రత తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య అధికారి రాజేందర్ సూచించారు. శుక్రవారం నిర్మల్ లోని అస్రా కాలనీ పర్యటించారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ప్రభుత్వ సంబంధిత ఆయా శాఖల అధికారులు, సిబ్బంది బాధ్యతగా ప్రజలను అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా అంతర్గత వీధులలో తిరుగుతూ ప్రబలే విష జ్వరాలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్