నిర్మల్: జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు పేర్కొన్నారు. శనివారం నిర్మల్ లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులు కార్మిక ఆస్తిత్వానికి అత్యంత ప్రమాదకరం అన్నారు. ఈ సందర్భంగా సమ్మె సంబంధిత బుక్ లను ఆవిష్కరించారు. ఇందులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్, గంగామణీ, నంద కమల ఉన్నారు.