నిర్మల్: అంబేద్కర్ కు జరిగిన అవమానాలు అన్నిఇన్ని కావు
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు జరిగిన అవమానాలు అన్ని ఇన్ని కావని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు మ. అంబేద్కర్ చౌక్ లో 134 జయంతి ఉత్సవాల సందర్భంగా పంచశీల పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ప్రపంచ విజ్ఞానిగా ఆదర్శం మూర్తిగా అంబేద్కర్ కీర్తించబడుతున్నాడని చెప్పారు. యువత అయనను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి లు ఉన్నారు