నిర్మల్: ఓయూపీహెచ్‌డి అర్హత పరీక్షలలో మూడవ ర్యాంక్
OUPHDఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలలో సారంగాపూర్ కు చెందిన విద్యార్థిని శ్రావిక రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తండ్రి మోహన్ స్థానికంగా టైలరింగ్ పనిచేస్తూ శ్రావికను చదివించాడు. సౌత్ సెంట్రల్ క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఇటీవల నెట్ రాసింది. జాతీయ స్థాయిలో 42 వ ర్యాంకు సాధించింది. చదువుకు పేదరికం అడ్డురాదని తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని PHD చేసేందుకు అర్హత సాధించానని తెలిపారు.