ప్రతి ఒక్క మహిళ సంఘాల ద్వారా ఆర్ధిక పురోగతి సాధించాలని డీఆర్డివో విజయ లక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా జిల్లా దిలావర్ పూర్ మండల మహిళా సమైక్య భవనంలో తొమ్మిది మండలాలకు సంబంధించిన ఏపీఎం, సీసీల శిక్షణ తరగతులకు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండి స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం ప్రసాద్ ఆయా మండలాల ఏపిఎంలు సిసి లు పాల్గొన్నారు.