దేవరకోట ఆలయంలో వైభవంగా పల్లకి సేవ

63చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన శ్రీ దేవరకోట లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్టించి మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీధర్, ఇంచార్జీ ఈఓ రవి కిషన్, ధర్మకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్