ఇద్దరిపై పోక్సో కేసు నమోదు: నర్సాపూర్ (జి)ఎస్ఐ
నర్సాపూర్ జి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు మోహన్ రావు, మనోహర్ రెడ్డిలపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై మంగళవారం తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరుత్వం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.