నిర్మల్ దాబాలలో పోలీసుల తనిఖీలు
జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నిర్మల్ పోలీసులు ఆయా మండల కేంద్రాలలో, ఇతర ప్రాంతాలలో ఉన్న ధాబాలలో తనిఖీలు చేశారు. దాబాల నిర్వాహకులకు పలు హెచ్చరికలు చేయడంతో పాటు సూచనలు ఇచ్చారు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా దాబాలు నిర్వహించుకోవాలని సూచించారు. అసాంఘీక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు.