నిర్మల్ లో పోలీసుల తనిఖీలు.. మైనర్లకు సూచనలు

66చూసినవారు
నిర్మల్ లో పోలీసుల తనిఖీలు.. మైనర్లకు సూచనలు
నిర్మల్ లో పోలీస్ భద్రతను మరింత ప్రతిష్టం చేస్తూ జిల్లా ఎస్పీ జి. డా. జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఏఎస్పీ రాజేష్ మీనా, పట్టణ సీఐ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమారులు పర్యవేక్షించారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మైనర్ డ్రైవింగ్ పై మైనర్లకు అవగాహన కల్పించడంతో పాటు తగిన విధంగా హెచ్చరించారు. ఆసాంఘీక కార్యకలాపాలపై అప్రమతమయ్యారు.

సంబంధిత పోస్ట్