తాండ్ర, కొరటికల్, మేడిపల్లి ఉపకేంద్రాల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఏఈ బాలయ్య తెలిపారు. సారంగాపూర్ మండలంలోని చించోలి(బి), ఆలూర్, జామ్ 33/11 కేవీ ఉప కేంద్రాల పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో డీఈ డి. నాగరాజు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. పెంబి ఉప విద్యుత్తు కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలకు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ జీటీ శ్రీనివాస్ తెలిపారు.