మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య: హెచ్ఎం
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించడం జరుగుతున్నదని ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ పేర్కొన్నారు. గురువారం మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో ఉపాధ్యాయులు హేమలత, సంతోష్ కుమార్, రాజేందర్, చెట్ల శ్రీనివాస్, సురేందర్, మోరే శ్రీనివాస్, మసీఓద్దీన్ లు ఉన్నారు.