నర్సాపూర్ (జి)లో భక్తి ప్రపత్తులతో రథసప్తమి వేడుకలు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరంలో మంగళవారం గ్రామ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రథ సప్తమి వేడుకలను భక్తిప్రపత్తుల మధ్య ప్రారంభించారు. 7 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో రథసప్తమి నిర్వహిస్తామని చివరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.