రాథోడ్ రమేష్ పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేఎల్పీ నేత

51చూసినవారు
రాథోడ్ రమేష్ పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేఎల్పీ నేత
మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాథోడ్ రమేష్ పార్థివదేహానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శనివారం రాత్రి ఉట్నూర్ లో నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాథోడ్ రమేష్ మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రమేష్ రాథోడ్ తన ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు.