దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామస్తులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్ష శుక్రవారం రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దిలావర్పూర్-గుండంపల్లి గ్రామ శివారులలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీక్ష తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.