నిర్మల్ లో యుద్ధ ప్రాతిపదికన చేతిపంపుల మరమ్మతులు

53చూసినవారు
నిర్మల్ లో యుద్ధ ప్రాతిపదికన చేతిపంపుల మరమ్మతులు
నిర్మల్ లోని చేతిపంపులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా పట్టణంలో నిలిచిపోయింది. దీంతో గురువారం అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు సదరు ప్రాంతాలలో ఉన్న చేతిపంపులను మరమ్మతులు చేస్తున్నారు. ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ డిఈ హరి భవన్ తెలిపారు. గుట్ట, శివారు ప్రాంతాలపై దృష్టి పెట్టామన్నారు.

సంబంధిత పోస్ట్