నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

73చూసినవారు
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్